కేంద్ర ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను అందిస్తోంది. అందులో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ పాపులర్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరేవారికి వృద్ధాప్యంలో రూ.1,000 నుంచి రూ.5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది.
ఈ పెన్షన్ పొందాలంటే స్కీమ్‌లో చేరిననాటి నుంచి ప్రతీ నెలా కొంత మొత్తం జమచేస్తూ ఉండాలి. జమ చేసే మొత్తాన్ని బట్టి పెన్షన్ లభిస్తుంది. ఈ పాపులర్ పెన్షన్ స్కీమ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే 99 లక్షల మంది చేరారు. అంటే సుమారు 1 కోటి మంది ఈ స్కీమ్‌లో చేరారు. 2022 మార్చి నాటికి ఈ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య 4.01 కోట్లు దాటింది.