మురికి కాలువలో కరెన్సీ నోట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం

ఆదివారం, 7 మే 2023 (13:15 IST)
బీహార్ రాష్ట్రంలోని సానారామ్‌లోని ఓ మురికి కాలువలో కరెన్సీ నోట్లు కనిపించాయి. వీటిని చూడగానే ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మురికి కాలువలో రూ.100, రూ.10 నోట్లు కనిపించాయి. దీంతో స్థానికులు పోటీపడి నోట్లను దక్కించుకునేందుకు జనం పోటీపడుతున్నారు.  
 
కాలువలో కరెన్సీ నోట్లు తేలడంతో నీటి అడుగున్న నోట్ల కట్టలు ఉండొచ్చని జనం ఎగబడ్డారు. నీటిపైన తేలుతున్న నోట్లను ఏరుకోవడంతో పాటు అడుగున్న మట్టి, చెత్తలో గాలించారు. కొందరు అడుగున ఉన్న మట్టిని చేతులతో ఒడ్డుకు తెచ్చిమరీ కరెన్సీ నోట్ల కోసం వెతికారు. 
 
అయితే, ఆ కరెన్సీ నోట్లు నకిలీవి కావొచ్చని మరికొందరు స్థానికులు సందేహిస్తున్నారు. స్థానికుల సమాచారం అందించడంతో వెంటనే అక్కడకి చేరుకున్నామని, అయితే, కాలువలో తమకు కరెన్సీ నోట్లు ఏవీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. ఇదంతా కేవలం పూకార్లు అయివుండొచ్చని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు