త్వరలో చెన్నైలో ప్లాస్మా బ్యాంక్!

ఆదివారం, 12 జులై 2020 (16:32 IST)
చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో త్వరలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు కానుంది. కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మా సేకరించి బాధితులకు అందించి, వారిలో వైరస్ నిరోధకత పెంచేది ప్లాస్మా చికిత్స. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఈ చికిత్స విధానానికి ఐసీఎంఆర్ అంగీకారం తెలిపింది. చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 25 మంది, మదురై, తిరునల్వేలి ప్రభుత్వాసుపత్తులలో తలా ఒకరు చొప్పున ప్లాస్మా చికిత్సతో కోలుకున్నారు. 
 
దీంతో ఈ చికిత్స విధానాన్ని విస్తృత పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ త్వరలో ప్రారంభం కానుంది. దేశంలో ఇలాంటి బ్యాంక్ ఢిల్లీలో ఉండగా, తమిళనాడులో రెండవది. కరోనా నుండి కోలుకున్న వారు రక్తదానం చేయాలని ప్రభుత్వం కోరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు