రూ.14,850 కోట్లతో నిర్మించిన బుందేల్‌ఖండ్ రహదారి ప్రారంభం

శనివారం, 16 జులై 2022 (15:21 IST)
దేశంలో మరో జాతీయ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. మొత్తం రూ.14,850 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ జాతీయ రహదారిని నిర్మించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతం అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టింది. 
 
మొత్తం ఆరు లేన్లతో నిర్మితమైన ఈ రహదారిని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త రహదారికి చెందిన ఫోటోలు, వీడియోలను గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ రహదారి నిర్మాణంతో బుందేల్‌ఖండ్ రూపురేఖలు మారిపోతాయని, ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ రహదారి ప్రారంభోత్సవ వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 


 

Hon’ble PM Shri @narendramodi inaugurated Bundelkhand Expressway in Jalaun, Uttar Pradesh.

Bundelkhand Expressway will ensure seamless connectivity, further economic progress, help tourism besides generating employment.#VikasKaExpressway pic.twitter.com/wJtlL1huE7

— G Kishan Reddy (@kishanreddybjp) July 16, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు