జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సోమవారం ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని బాపూ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పుష్పగుచ్ఛములుంచి ఘనంగా నివాళులర్పించారు.
అలాగే, హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్ముడికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రలు, ముఖ్య నేతలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు మహాత్మాగాంధీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదేవిధంగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.