మోడీ పాలనకు 2 నెలలు: 'మై గవర్నమెంట్' పేరుతో కొత్త వెబ్‌సైట్

శనివారం, 26 జులై 2014 (16:03 IST)
ప్రధానిగా నరేంద్రమోడీ పాలనకు రెండు నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా 'మై గవర్నమెంట్' (mygov.nic.in) పేరుతో మోడీ కొత్త వెబ్ సైట్ ప్రారంభించారు. సురాజ్యం కోసం ప్రజల అభిప్రాయాలకు భాగస్వామ్యం కల్పించనున్నారు. అంతేగాక ప్రభుత్వ శాఖలు, విద్యావ్యవస్థ, పథకాల్లో ప్రక్షాళన చేసేందుకు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోనున్నారు.
 
ఇదిలా ఉంటే.. లోక్ సభ, రాష్ట్రాల శాసనసభలో మహిళలకు 15 ఏళ్ల పాటు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతానికి ప్రవేశపెట్టే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. మహిళా బిల్లుపై రాజకీయ పార్టీల మధ్య వచ్చే ఏకాభిప్రాయంతో పాటు ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని మోడీ సర్కార్ స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి