బైడెన్‌తో భేటీకానున్న ప్రధాని నరేంద్ర మోడి!!

శనివారం, 4 సెప్టెంబరు 2021 (15:35 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెలాఖరులో అమెరికాకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
 
గ‌త ఏడాది దేశాధ్య‌క్షుడిగా జో బైడెన్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. మోడీకి ఇది తొలి ప‌ర్య‌ట‌న కానున్న‌ది. ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం ప్ర‌కారం.. వాషింగ్ట‌న్ డీసీ, న్యూయార్క్‌లో మోడీ ప‌ర్య‌టిస్తారు. సెప్టెంబ‌ర్ 22 నుంచి 27 మ‌ధ్య ఆ టూర్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. 
 
అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌తో మోడీ ప్ర‌త్యేకంగా భేటీకానున్నారు. అయితే ఆ ఇద్ద‌రూ ఇప్ప‌టికే మూడు సార్లు వ‌ర్చువ‌ల్‌గా క‌లిశారు. మార్చిలో క్వాడ్ మీటింగ్‌, ఏప్రిల్‌లో వాతావ‌ర‌ణ మార్పులు, జూన్‌లో జ‌రిగిన జీ-7 స‌ద‌స్సులో వాళ్లు క‌లుసుకున్నారు.
 
2019 సెప్టెంబ‌ర్‌లో ప్ర‌ధాని మోడీ అమెరికా వెళ్లారు. అప్పుడు ఆయ‌న మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను క‌లిశారు. హౌడీ మోడీ ఈవెంట్‌లోనూ ఆయ‌న పాల్గొన్నారు. అయితే ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ల రాజ్యం ఏర్ప‌డిన నేప‌థ్యంలో బైడెన్‌తో మోదీ భేటీ కీల‌కం కానున్న‌ది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు