ముందుగా ప్రకాష్‌రాజ్ సినిమా బిడ్డలు అనే పేనల్ ప్రకటించాడు. ఆ తర్వాత నాన్ లోకల్ సమస్య రావడంతో అది రచ్చ రచ్చ అయింది. నాగబాబు గత కమిటీ మసనబారింది అని స్టేట్ మెంట్ ఇవ్వడంతో కొందరు సభ్యుల్లో ఊపు వచ్చింది. అలా హేమ, జీవిత రాజశేఖర్, జయసుధతోపాటు మరో ఇద్దరు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జయసుధ కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అవసరమైతే మా కు తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించింది. దీంతో మీడియా ఫోకస్ చేసే సరికి మాలోని లుకలుకలు ఒక్కోటి బయటపడ్డాయి. దాంతో మెగా ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేశ్ తాను ఎటువంటి ఆర్థిక పరమైన విషయాలలో తప్పు చేయలేదని ప్రకటించాడు.
ఇంకో వైపు విష్ణు మంచు మా భవనాన్ని తాము నిర్మిస్తామని, స్థలం కూడా చూశామని వెల్లడించారు. ఇది మరింత చర్చ అయింది. ఇక మెగా ఫ్యామిలీకి ఇది ప్రెస్టేజీ ఇష్యూగా తయారైందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వెంటనే రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ ను పోటీదారులతో సంప్రదింపులు జరిపారు. ఆఖరికి హేమ, జీవిత అందుకు అంగీకరించారు. సివి.ఎల్. నరసింహారావు ఇలాంటి గొడవలకు దూరంగా వుంటానని తప్పుకున్నాడు. ఇక మంచు విష్ణు కదిలించే స్థతిలో లేరు. అందుకే ఫైనల్‌గా అంతకుముందు వున్న కమిటీలోని పేర్లు మార్చి కొందరు తీసేశారు. వారిలో ఏడిద శ్రీరామ్‌తోపాటు నలుగురు సీనియర్ సభ్యులు వున్నారు. సో. పట్టుదలగా ఈసారి `మా` ఎన్నికలు తమ అడుగుజాడల్లో వుండాలనే ఓ వర్గం నిర్ణయం తీసుకోవడంతో ప్రకాష్‌ఱాజ్ పేనల్ లిస్టు మారిందని తెలుస్తోంది.
ఇదిలా వుండగా, నాగబాబు మసక బారింది అన్న మాటలకు అర్థం ఏమిటి? అసలు మాలో ఏం జరుగుతుందో మీరు చెప్పాలని విలేకరులు పట్టుబడితే ప్రకాష్‌రాజ్ దాటవేస్తూ, అది ఆయన్నే అడగండి అంటూనే, కొన్ని చెప్పకూడని విషయాలు వుంటాయి. కొన్ని చెప్పే విషయాలుంటాయని చెప్పకుండానే చెప్పాడు. సో. ఫైనల్‌గా ప్రకాష్‌రాజ్‌ను గెలిపించే దిశగా మెగా ఫ్యామిలీ కంకణం కట్టుకుంది. మరి మోహన్‌బాబు ఊరుకుంటాడా? తనకూ పట్టుదల వుంటుందిగదా.. మరి ఏం జరుగుతుందో ఎలక్షన్ డేట్ నాటికి సరికొత్త కథ మొదలవ్వబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.