దేశవ్యాప్తంగా పెద్ద నోట్లను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేసిన నేపథ్యంలో, సెలెబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు ఇబ్బందులు తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేయడంతో వాటిని మార్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ నేతల నుంచి పేద ప్రజల వరకు డబ్బులు పొందేందుకు బ్యాంకు క్యూలైన్లలో నిలబడుతున్నారు.
దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద బారులు తీరి.. గంటల కొద్దీ వేచిచూస్తూ పాతనోట్లను మార్చుకుంటున్నారు. తాజాగా ఈ నోట్ల రద్దుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌కు కూడా ఇబ్బందులు తప్పట్లేదు. మోడీ తల్లి హీరాబెన్ కూడా తన వద్దనున్న పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు వరకు వచ్చారు. మంగళవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల ఓ బ్యాంకుకు చేరుకున్న ఆమె... పాత పెద్దనోట్లను మార్చుకుని కొత్తనోట్లను తీసుకున్నారు.