కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని.. రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడంతో.. ఆ నవ్వు రామాయణంలో ఎవరిదబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే సాగింది. దీనిపై రేణుకా చౌదరి మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని గుర్తు చేశారు.