ఇపుడు రాష్ట్రపతిని కాదు.. ఉపాధ్యాయుడిని.. ప్రణబ్ సార్ అని పిలవండి : విద్యార్థులతో ప్రెసిడెంట్

మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (12:36 IST)
దేశ ప్రథమ పౌరుడు ఉపాధ్యాయుడిగా మారిపోయాడు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోని రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయలో ఆయన విద్యార్థులకు పాఠాలు బోధించారు. తరగతి గదిలోకి వెళ్తూనే తనను 'ప్రణబ్ సార్ లేదా ముఖర్జీ సార్' అని పిలవాలని పిల్లలకు ముందుగానే సూచించారు. 
 
ఆ తర్వాత సుమారు గంటపాటు విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పారు. విస్తృతమైన అంశాలపై తన అభిప్రాయాలను పిల్లలతో పంచుకున్నారు. ముఖ్యంగా, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న టెర్రరిజంపై విద్యార్థులతో చర్చించిన ఆయన.. భారత్‌లో టెర్రరిజం జాడలు లేవని అన్నారు. అలాగే సెక్యులరిజం గురించి విద్యార్థులతో మాట్లాడారు. సెక్యులరిజం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమన్నారు. 
 
ఈ యేడాది మార్చిలో జరిగిన బీజేపీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై మాట్లాడారు. దీని ద్వారా ప్రతి ఏటా ఎన్నికల పేరిట ఖర్చుచేస్తున్న కోట్ల రూపాయల ధన వ్యయాన్ని తగ్గించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి