మధుమేహం వ్యాధిగ్రస్థులకు గుడ్ న్యూస్.. ఆ ధరలు తగ్గాయట

శనివారం, 27 ఆగస్టు 2022 (12:59 IST)
భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు తొమ్మిది శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. కొన్ని పట్టణ ప్రాంతాలలో 11 శాతం దాటింది. 
 
అయితే మధుమేహం సహా వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగించే 45 రకాల మందులకు గరిష్ఠ చిల్లర ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) చేంజే చేసింది.
 
ప్రస్తుతం మార్కెట్‌లో 15 మాత్రలు ఉండే సిటాగ్లిప్టిన్‌ + మెట్‌ఫామిన్‌ ప్యాక్‌ను గరిష్ఠంగా రూ.345 వరకు అమ్ముతున్నాయి. అయితే వీటి ధరలను NPPA సవరించింది. 
 
2.5 ఎంజీ మాత్ర ధరను రూ.16.17, 5 ఎంజీ ట్యాబ్లెట్‌ ధరను రూ.25.33గా నిర్ణయించింది. టైప్‌-II మధుమేహంతో బాధపడుతున్న వారిలో 30 శాతం మందికి వైద్యులు సిటాగ్లిప్టిన్‌ లేదా లినాగ్లిప్టిన్‌ సిఫార్సు చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు