ప్రపంచ నాయకుల్లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ నెంబర్ 1

శనివారం, 9 డిశెంబరు 2023 (11:19 IST)
కర్టెసి-ట్విట్టర్
భారత ప్రధాని నరేంద్ర మోదీ నెంబర్ వన్. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వే ప్రకారం 76 శాతం ఆమోదం రేటింగ్‌తో ప్రపంచ నాయకులలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. యుఎస్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ 'గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్' ప్రకారం భారతదేశంలో 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించగా, 18 శాతం మంది దీనిని ఆమోదించలేదు. ఆరు శాతం మంది ఎటువంటి అభిప్రాయం చెప్పలేదు.
 

My leader!! My pride!! Nation’s pride!!
Loved by the world. @narendramodi pic.twitter.com/bdqSrgTG6p

— KhushbuSundar (@khushsundar) December 9, 2023
మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్‌కి 66 శాతం, స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్ 58 శాతంతో రెండు-మూడు స్థానాల్లో వున్నారు. గత సర్వేల్లోనూ గ్లోబల్ రేటింగ్స్‌లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు 37 శాతం, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు 31 శాతం, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి 25 శాతం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు కేవలం 24 శాతం మాత్రమే ఆమోదం లభించింది. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి ఇది బూస్ట్ లాంటిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు