ఏపీలో పర్యటించనున్న ప్రధాన మంత్రి.. శ్రీవారి దర్శనం

ఆదివారం, 26 నవంబరు 2023 (11:40 IST)
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈరోజు సాయంత్రం 5:45 గంటలకు ఆయన తిరుపతికి వెళ్లి రాత్రికి తిరుమలలో బస చేస్తారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 8.45 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి మధ్యాహ్నం 1:30 గంటలకు హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సీఎం బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 
 
అయితే ప్రధాని పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆయనను ప్రత్యేకంగా కలుస్తారా? రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చిస్తారా? ప్రొటోకాల్ ప్రకారం స్వాగతించడానికి మాత్రమే వెళ్లాలా అనే చర్చ కూడా సాగుతోంది. 
 
మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈమేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీ సాయంత్రం వైమానిక దళంలో తిరుపరి విమాశ్రయానికి చేరుకుని, అనంతరం తిరుమల వెళ్లి రాత్రి బస చేస్తారు. 
 
27న ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నట్లు సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. అందువల్ల ప్రధాని పర్యటనకు సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు