ప్రజలు చనిపోతున్నా పన్నుల మోత కొనసాగుస్తున్నారు : ప్రియాంకా

శుక్రవారం, 28 మే 2021 (12:59 IST)
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పన్నుల బాదుడుకు స్వస్తి చెప్పడం లేదన్నారు. ముఖ్యంగా, కోవిడ్ సంబంధిత చికిత్స‌లో వినియోగిస్తున్న వైద్య ప‌రిక‌రాలు, మందుల‌పై జీఎస్టీ మోత మోగిస్తున్నారన్నారు. 
 
త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆమె ఇదే అంశంపై ట్వీట్ చేశారు. కోవిడ్‌పై పోరాటంలో ప్రాణాలు కాపాడుతున్న అన్ని ర‌కాల వైద్య సామాగ్రి, మందుల‌పై జీఎస్టీ ఎత్తివేసి భారం త‌గ్గించాల‌న్నారు. మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ మందుల‌పై జీఎస్టీ వ‌సూల్ చేయ‌డం క్రూర‌త్వ‌మే అవుతుంద‌ని ఆమె విమ‌ర్శించారు. 
 
కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలో జీఎస్టీ స‌మావేశం కానున్న నేప‌థ్యంలో ప్రియాంకా ఈ ట్వీట్ చేశారు. శానిటైజ‌ర్‌, సోప్‌లు, గ్లౌజ్‌లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు .. ఇలా అనేక మందులు, సామాగ్రిపై ఉన్న జీఎస్టీని ర‌ద్దు చేయాల‌ని ప్రియాంకా కోరారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు