615 కిలోల బరువున్న రీశాట్-2బీర్1 ఉపగ్రహాన్ని రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. అయితే దీని కాలపరిమితి మాత్రం ఐదేళ్లు. PSLV-C46 ప్రయోగాన్ని ముందుగా బుధవారంనాడు ఉదయం 5 గంటల 27 నిమిషాలకు ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్థాలు అడ్డువస్తాయని గుర్తించి 3 నిమిషాల ఆలస్యంగా ఐదున్నర గంటలకు ప్రయోగం చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ప్రస్తుతం కౌంట్‌డౌన్ నిరాటంకంగా కొనసాగుతోంది.