దీంతో అత్యంత సంక్లిష్టమైన గర్భసంచి మార్పిడి ఆపరేషన్‌ను చేసేందుకు పుణెలోని గెలాక్సీ కేర్ లాప్రోస్కోపీ ఇనిస్టిట్యూట్ వైద్యులు ముందుకు వచ్చారు. ఈ ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని గురువారం చేపట్టారు. ఏకధాటిగా 9 గంటల పాటు ఆపరేషన్ చేసి విజయం సాధించారు. ఆపరేషన్ తర్వాత తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
గర్భసంచిని స్వీకరించిన మహిళ గర్భందాల్చాలంటే ఏడాదిపాటు వేచి ఉండాలని, అప్పట్లోగా ఆమె శరీరం నూతన గర్భాశయానికి అలవాటు పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు గర్భసంచి మార్పిడి 30 జరగగా, అందులో కొన్ని కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి.