నెట్‌లో ఆ యాప్: 16మందిని అలా మోసం చేసిన మహిళ

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (15:36 IST)
నెట్‌లో డేటింగ్ యాప్ ద్వారా 16 మంది పురుషులను మోసం చేసిన పూణే మహిళ ఉదంతం వెలుగులోకి వచ్చింది. 27ఏళ్ల మహిళ 16మంది పురుషులను మాయ మాటలతో వలలోకి దించి.. డబ్బులు గుంజేసింది. నెట్‌లో డేటింగ్ యాప్ ద్వారా మోసం చేసిన మహిళను ఫిబ్రవరి 4న పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖిలేడి బాగోతం బయటపడింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణలో లేడీ పేరు సయాలీ కలే అని తేలింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన సయాలీ.. డబ్బు కోసం ఇలా అవతారం ఎత్తింది. డేటింగ్ యాప్ ద్వారా పురుషులను మోసం చేసింది. 
 
హోటల్ గదికి రప్పించి డ్రగ్స్ ఇచ్చి.. విలువైన వస్తువులను దోచుకునేదని పోలీసులు తెలిపారు. ఇలా 16 మంది పురుషుల వద్ద భారీగా డబ్బు గుంజేసిందని.. ఇప్పటివరకు పోలీసులు రూ.15.25 లక్షల విలువ గల నగలను, నగదును స్వాధీనం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు