బెంగళూరు: నటుడు పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం మధ్యాహ్నం తెలిపారు. నటుడి కుమార్తె న్యూయార్క్ నుండి విమానంలో ఆలస్యంగా రావడంతో, వారి అభిమానుల కోసం మరింత సమయం ఇవ్వడానికి ఈ సాయంత్రం జరగాల్సిన దహన సంస్కారాలు వాయిదా పడ్డాయని బొమ్మై చెప్పారు.
ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తుది నివాళులర్పించారు. కంఠీరవ స్టూడియోలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం 12 కిలోమీటర్ల దూరంలోని కంఠీరవ స్టేడియంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు.
రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేడియం వద్ద పోలీసులు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు, విట్టల్ మాల్యా రోడ్డులోని సెయింట్ జోసెఫ్ మైదానం, నృపతుంగ రోడ్డులోని వైఎంసీఏ మైదానంలో స్థలం అందుబాటులో ఉంది.
కంటతడి పెట్టుకున్న బాలయ్య
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ. బెంగుళూరులో ఉన్న కంఠీరవ స్టేడియంలో ఉన్న పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు వచ్చారు నందమూరి బాలకృష్ణ. అయితే పునీత్ పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు బాలకృష్ణ. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్‌ను ఓదార్చారు.
నిజానికి పునీత్ రాజ్ కుమార్ నందమూరి బాలకృష్ణతో, ఆయన కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. పునీత్ మరణం తీరని లోటుగా చెప్పుకొచ్చారు బాలకృష్ణ పేర్కొన్నారు. ఇక మరికాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బెంగుళూరుకు రానున్నారు.