ఓటు వేసి గెలిపించిన పాపానికి యువకుడిని చితకబాదిన ఎమ్మెల్యే (Video)

బుధవారం, 20 అక్టోబరు 2021 (21:28 IST)
Joginder Singh
ఓటు వేసి గెలిపించుకున్న నాయకులను ప్రశ్నిస్తే వారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో ఊహించలేం. అలాంటి ఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. నియోజకవర్గానికి ఏం చేశావని అడిగిన ఓ వ్యక్తిని పంజాబ్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. పఠాన్‌కోట్‌లోని భోవాలో ఈ ఘటన వెలుగు చూసింది. 

వివరాల్లోకి వెళితే.. గ్రామంలో తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే జోగిందర్ వివరిస్తుండగా.. ఓ యువకుడు ఆయన్ను ప్రశ్నించాడు. దీంతో పక్కనే ఉన్న పోలీసు అధికారి ఆ యువకుడ్ని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ యువకుడు మాత్రం మీరేం ఏం చేశారో చెప్పాలంటూ జోగిందర్‌ను గట్టిగా అరుస్తూ క్వశ్చన్ చేశాడు. 
 
దీంతో జోగిందర్ అతడ్ని దగ్గరకు రమ్మని పిలిచారు. యువకుడి చేతికి మైక్ ఇచ్చి అతడ్ని కొట్టారు. జోగిందర్‌తోపాటు పోలీసులు, పలువురు అధికార పార్టీ నేతలు యువకుడిపై దాడికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది.

After Rahul Gandhi and Priyanka Vadra turned out journalists from their PCs for asking factual questions, it is turn of Joginder Singh, Congress MLA from Boha in Pathankot, to thrash a young man black and blue for just questioning him.

This is the intolerant face of Congress. pic.twitter.com/pA8hiKNVjZ

— Amit Malviya (@amitmalviya) October 20, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు