డ్రగ్స్ దొంగల్ని లంచం తీసుకుని విడిపించిన స్పెషలిస్ట్ ఇంద్రజిత్ అరెస్ట్.. ముఖానికి ముసుగుకట్టి?

మంగళవారం, 13 జూన్ 2017 (14:46 IST)
డ్రగ్స్ దొంగల్ని పట్టుకుంటే..  వాళ్లు ఏదో రూపంలో విడుదలైపోతున్నారు. ఇలా ఎందరో నిందితులు విడుదలైపోతున్నారు. కష్టపడి పోలీసులు పట్టుకుంటే మెల్లగా నిందితులు బయటకు వచ్చేయడంతో అధికారులు విస్తుపోయారు. తీరా టాస్క్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో డ్రగ్స్ దొంగలను పట్టుకోవడంలో స్పెషలిస్ట్ అని పేరు తెచ్చుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రజిత్ సింగ్ బండారం బయటపడింది. ఆయన ఇంట్లో డబ్బుకట్టలు, ఏకే 47 ఆయుధాలు, నార్కోటిక్స్ వంటి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆపై ఇంద్రజిత్ ముఖానికి ముసుగుకట్టి ఇంట్లో నుంచి తీసుకెళ్లారు. దీంతో ఇన్నాళ్ల పాటు సంపాదించుకున్న స్పెషలిస్ట్ అనే పేరు గంగలో కలిసిపోయింది. పంజాబ్‌లో పేరు మోసిన ఇంద్రజిత్ డ్రగ్స్ పట్టుకోవడంలో చురుకైన అధికారిగా పేరుతెచ్చుకున్నాడు. ఈయన చేపట్టిన తనిఖీల్లో వంద శాతం సక్సెస్ అయినా.. కేసుల్లో డొల్లతనం కారణంగా నిందితులు విడుదలైపోయేవారు. 
 
ఇటీవల అత్యధికంగా 19 కిలోల డ్రగ్స్ పట్టుబడినా నిందితులు కోర్టు నుంచి బెయిల్ పొందారు. తరచూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆపై నిర్వహించిన తనిఖీలు, దర్యాప్తులో నిందితులను విడిపించేందుకు ఇంద్రజిత్ సింగ్ పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్టు తేలింది. దీంతో ఆయన అరెస్ట్ తప్పలేదు.

వెబ్దునియా పై చదవండి