కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్రం మరోమారు ఝులక్ ఇచ్చింది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ తాజాగా నోటీసులు జారీచేసింది. మోడీ అనే పేరు దేశంలోని దొంగలకే ఎందుకు ఉంటుందంటూ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని పరోక్షంగా ఉద్దేశించి నాలుగేళ్ల క్రితం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే.
కాగా, సూరత్ కోర్టు రాహుల్ గాఁధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో నిబంధనల ప్రకారం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటుపడింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఎన్నో లక్షల కేసులు సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటే రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం దావా కేసు విచారణను నాలుగేళ్లలో పూర్తి చేసి తీర్పునివ్వడం, ఆ తర్వాత ఆయన ఎంపీపై అనర్హత వేటు వేయడం, ఇపుడు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయడం అనేది కుట్రపూరితమే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.