'నువ్వే నా గురువు, మార్గదర్శకులు, నా బలం' : రాహుల్

ఆదివారం, 19 నవంబరు 2017 (17:03 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నాన్నమ్మ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని సంస్మరించుకున్నారు. ఆదివారం ఇందిరా గాంధీ శత జయంతి వేడుకను పురస్కరించుకుని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తన నానమ్మకు ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు. "నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో సంతోషంగా ఉంటుంది నానమ్మా. నువ్వే నా గురువు, మార్గదర్శకులు, నా బలం" అంటూ ట్వీట్ చేశారు.
 
కాగా, ఆదివారం ఉదయం ఢిల్లీలోని శక్తి స్థల్‌ స్థూపాన్ని రాహుల్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సందర్శించి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 
 
సూటిగా మాట్లాడే తత్వమే ఇందిరను గొప్ప నాయకురాలిని చేసిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశానికి దిశానిర్దేశం చేసిన మహిళా నేత ఇందిరా అని, అందుకే ఆమెను ప్రతి ఒక్కరూ భారత ఉక్కు మహిళ అని కొనియాడారని గుర్తు చేశారు. 

 

I remember you Dadi with so much love and happiness. You are my mentor and guide. You give me strength. #Indira100

— Office of RG (@OfficeOfRG) November 19, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు