ఎపుడైనా రాహుల్‌కు పట్టాభిషేకం...

ఆదివారం, 19 నవంబరు 2017 (15:51 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం ఓ తేదీని ఖరారు చేయాల్సిందే. ఈ తేదీని సోమవారం ఖరారు చేయవచ్చని జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 
 
రాహుల్ పట్టాభిషేకంపై సోమవారం ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై చర్చించనుంది. ఇందులోనే తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. గుజరాత్ ఎన్నికలకు ముందే రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. అధ్యక్ష రేసులో రాహుల్ ఒక్కరే ఉన్నారు. సీడబ్ల్యూసీ పార్టీ ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. 
 
ఆ తర్వాత దీనిని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ నోటిఫై చేస్తుంది. గుజరాత్ ఎన్నికలలోపే పార్టీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. నిజానికి అధ్యక్ష ఎన్నికల కోసం సీడబ్ల్యూసీ సమావేశం తప్పనిసరి కాకపోయినా.. పార్టీ అత్యున్నత కార్యవర్గం నిర్ణయం మేరకే ముందుకెళ్లాలని సోనియా భావించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గడువు డిసెంబర్ 31లోపు పార్టీ ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు