విమానాలలో ప్రయాణించేవారి లగేజీ విషయానికొస్తే, ఎక్కువ బరువున్న వస్తువులకు పెనాల్టీ కట్టడం సహజం. ఈ విషయాన్ని త్వరలోనే రైళ్లలో కూడా అమలు చేయనున్నారని సమాచారం. రైళ్లలో వేళ్లే ప్రయాణికులు లగేజీలు ఎక్కువగా తీసుకొనిపోవడం సహజం. ఇకపై ఇలాంటి విషయాలను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది. రైళ్లలో ఎవరైతే అధిక లగేజీలు తీసుకువెలుతున్నారో వారికి ఆరు రెట్లు పెనాల్టీ వేయడం జరుగుతుంది.
నిబంధనల ప్రకారం స్లీపర్ కోచ్‌లో 40 కేజీలు, సెకండ్ క్లాస్ ప్రయాణికులకు 35 కిలోల లగేజీలు తీసుకెళ్లవచ్చని రైళ్ల శాఖ నిర్ణయించిది. ఒకవేళ లగేజీలు 80, 70 కిలోలు దాటితే చార్జీని తీసుకోవలసిందిగా రైల్వే అనుమతిని ఇచ్చింది. లగేజీలు సైజు కూడా 100 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 25 సెంటీమీటర్ల ఎత్తుకు దాటకూడదని తెలియజేశారు.
ప్రస్తుతం ఈ నిబంధనలు ఇప్పుడే అమలులోకి వచ్చాయి కాబట్టి ఇకపై కఠినంగా నడవడికలు తీసుకోవడం జరుగుతుందని రైల్వే శాఖ తెలియజేసింది. ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేయడానికి కష్టపడుతున్నారని రైల్వే ఇలాంటి చర్యను తీసుకువచ్చింది. స్లీపర్ కోచ్‌లో ఎవరైతే 500 కిలోమీటర్ల దూరానికి 80 కిలోల బరువున్న లగేజీలు తీసుకువెలుతున్నారో వారు పార్సిల్ కార్యాలయంలో రూ. 109 కట్టవలసిందిగా రైల్వే నిర్ణయించిది. మరికొందరు చార్జీ చెల్లించకుండా ఇంత బరువును తీసుకెళుతూ దొరికిపోతే వారికి జరిమానా రూ. 654 కట్టవలసి ఉంటుంది.