వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చిన తలైవా రజనీకాంత్ క్షణం తీరిక లేకుండా రకరకాల కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
తను ఏర్పాటు చేసిన ‘రజనీ మక్కల్ మండ్రం’ పార్టీ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఇక రాజకీయాల్లోకి ఇక రానని చెప్పడమే కాకుండా ఆ పార్టీని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇక సినిమాల మీదే ఆయన దృష్టి పెట్టారు.
ముందు ‘అణ్ణాత్తే’ షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా షెడ్యూల్ బుధవారం నుంచి కోల్‌కతాలో జరుగుతుంది.
ఈ చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం రజనీకాంత్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు కోల్‌కతా చేరుకున్నారు. నవంబర్ 4న ‘అణ్ణాత్తే’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.