కోవిడ్ విధుల్లో ముందుండి పనిచేసి అందరి మనసులు చూరగొన్న వైద్యాధికారి గోపినాయక్‌తోపాటు పలువురు వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే మనం పొందిన స్వాతంత్య్రానికి నిజమైన సార్థకత అని గాంధీ మహాత్ముడు ఎప్పుడో చెప్పారని తెలిపారు.
ఆ దిశగా ఈ దేశంలోనే తొలి అడుగులు వేసింది మన ఏపీ మాత్రమేనని చెప్పారు. జగనన్న వల్లనే ఇది సాధ్యమైందన్నారు. గ్రామాల్లో ఇప్పుడు సచివాలయాలు విలసిల్లుతున్నాయని తెలిపారు. జనానికి కావాల్సిన అన్ని సేవలను సచివాలయాలే అందిస్తున్నాయని పేర్కొన్నారు. వాలంటీర్లు ఇళ్ల వద్దకే వచ్చి సేవలు అందిస్తున్నారని, ఇలాంటి పరిపాలనను కలలో కూడా ఊహించి ఉండమని తెలిపారు.
ఎందరో మహానుభావులు మన దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొస్తే.. మన జగనన్న ఆయన పాలన ద్వారా ఆ మహానీయుల త్యాగాలకు సరైన నివాళి అర్పిస్తున్నారని పేర్కొన్నారు. నిజమైన స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు దక్కేలా చూస్తున్నారని చెప్పారు. మన స్వతంత్య్ర భారతదేశానికి అతి పెద్ద ఆస్తి మన ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పారు.
ఇంత గొప్ప వ్యవస్థను మనకు పెద్దలు అందిస్తే.. గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించాయని దుయ్యబట్టారు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికయ్యే ప్రభుత్వాలను ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని అంటామని, ప్రజల కోసమే, ప్రజలకై పనిచేసే ప్రభుత్వాన్ని మాత్రం జగనన్న ప్రభుత్వం అనాల్సిందేనని చెప్పారు. ఈ మాట ఇప్పుడు ఏపీలో ప్రజలే చెబుతున్నారని వెల్లడించారు.
కార్యక్రమంలో తహశీల్దార్ సుజాత, కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ సెక్రెటరీ ఝాన్సీరాణి, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బొల్లెద్దు చిన్న, వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, యార్డు డైరెక్టర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట పట్టణ, యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట రూరల్ మండలాల అధ్యక్షులు పఠాన్ తల్హాఖాన్, కల్లూరి బుజ్జి, జి.శ్రీనివాసరెడ్డి, డి.శంకరరావు,
పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,పార్టీ అధికార ప్రతినిధి షేక్ దరియవలి,పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి,బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరాంజనేయులు, యస్.టి సెల్ అధ్యక్షుడు బాలకోటి నాయక్, పార్టీ నాయకులు కె.శ్రీనివాసరావు (గోల్డు), రత్నారెడ్డి, మస్తాన్‌రావు, నల్లూరి సాంబశివరావు, తాళ్ల అంజిరెడ్డి, అల్లీమియా, తోటా బ్రహ్మస్వాములు, మాదం శ్రీనివాసరావు, మైదవోలు హనుమంతరావు, కిలారి రవీంద్ర,కట్టా సీతమ్మ,శ్రీకాంత్,మర్దు,సాపా సైదా వలి,మాజీ కౌన్సిలర్ లు,పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.