కన్నబిడ్డను కాటేసిన తండ్రి... అది తెలిసిన సోదరుడు...

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:50 IST)
తన కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రి.. కుమార్తె శీలంపై కాటేశాడు. ఈ విషయం తెలిసిన ఆ బాధితురాలి సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని జలోర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ఓ తండ్రి పెళ్లీడుకొచ్చిన కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న బాలిక అన్న ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
 
తండ్రి తనను రోజూ వేధిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాలిక తన అత్తకు మొత్తం సంఘటనను వివరించింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి 32 నిమిషాల ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో అది విన్న బాలిక సోదరుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 
 
బాలిక సోదరుడు సాంచోర్ ప్రాంతంలోని నర్మద కాలువలో దూకి మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ సంఘటన బయటకు రావడంతో బాలిక తండ్రి తన ఇంటి నుంచి పారిపోయాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలిక స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు