62 యేళ్ళ ఝున్ ఝున్ వాలా దేశంలోని ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్‌గా ఉన్న ఈయన హఠాన్మరణం పట్ల ప్రధాని మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం ఉదయం 6.45 గంటల సమయంలో రాకేశ్‌ను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి తరలించారు.
రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ఆకాశ ఎయిర్‌తో ఇటీవలే విమానయాన రంగంలో అడుగుపెట్టారు. తొలి విమానం ఈ నెల 7న సేవలు ప్రారంభించింది. ఇన్వెస్టర్‌గానే కాకుండా యాప్‌టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గానూ ఝున్‌ఝున్‌వాలా అందరికీ సుపరిచితం.
అంతేకాదు, పలు సంస్థలకు డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్‌కు భారత సలహాదారుగానూ ఉన్నారు. రాకేశ్‌కు దాతృత్వం కూడా ఎక్కువే. తన సంపాదనలో 25 శాతాన్ని విరాళంగా ఇస్తున్నారు. హెల్త్‌కేర్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ వంటి వాటికి విరాళాలు అందిస్తున్నారు.