సమాజ్‌వాదీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు : అమర్ సింగ్!

సోమవారం, 18 ఆగస్టు 2014 (13:34 IST)
తాను తిరిగి సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నట్టు వచ్చిన మీడియా వార్తలను రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ తోసిపుచ్చారు. అలాగే, ఎస్పీ నేతలు కూడా ముక్తకంఠంతో ఖండించారు. రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఎప్పుడైనా సమాజ్ వాదీ పార్టీలోకి వెళ్లవచ్చంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. ఆయన పార్టీలోకి తిరిగి రావడం లేదని ఎస్పీ సీనియర్ నేత, కీలక వ్యూహకర్త రాం గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. అటు అమర సింగ్ కూడా ఈ వార్తలను తిరస్కరించారు. 
 
రాం గోపాల్ యాదవ్ చెప్పింది కరక్టేనని, ఎస్పీలోకి మళ్లీ వెళ్లే ఆలోచన తనకు లేదని చెప్పారు. ములాయంతో తన సంబంధాలు మెరుగుపడ్డాయని... దాంతో, ఎప్పుడైనా ఆయనతో మాట్లాడతానన్న అమర్, అలాగని అందుకు లైసెన్స్ (పార్టీలో చేరడం) అవసరం లేదన్నారు. ఇటీవల లక్నోలో ఎస్పీ నిర్వహించిన కార్యక్రమంలో ములాయం, అమర్ పాల్గొన్నారు. అయితే, వారిద్దరూ ఆ సమయంలో మాట్లాడుకోక పోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి