తివారీ డ్యామ్‌కు గండి పడింది పీతల వల్లేనట!

శుక్రవారం, 5 జులై 2019 (16:07 IST)
మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా తివారీ ఆనకట్టకు గండి పడిన సంగతి తెలిసిందే. ఈ గండి కారణంగా డ్యామ్‌లోని నీళ్లు క్రింద వైపు ఉన్న ప్రాంతం మొత్తాన్ని ముంచివేయడం జరిగింది. డ్యామ్ కింద వైపు ఉన్న 12 నివాసాలు కొట్టుకుపోయి... 23 మంది గల్లంతు కాగా... ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. 
 
కాగా... ఆనకట్టకు గండిపడటంపై మహారాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. డ్యామ్ చుట్టూ పెద్ద సంఖ్యలో పీతలు ఉన్నాయని... వాటి వల్లే ఆనకట్టకు లీకేజీ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 
 
ఇంతకు ముందు లీకేజీలు లేవని... డ్యామ్ చుట్టూ పీతలు చేరిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించిన ఆయన... ఈ విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. 
 
అయితే అధికారులు దీనికి సంబంధించిన పనులు కూడా చేపట్టారని... అయినప్పటికీ దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. అవేవో పీతలు కాబట్టి సరిపోయింది కానీ మొసళ్లు అయితే ఏమై ఉండేదో మరి మంత్రిగారికే తెలియాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు