26 గంటల కౌంట్‌డౌన్ తర్వాత బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ –సీ48 రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా 628 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1, అమెరికాకు చెందిన తైవోక్–0129, ఐహోప్ శాట్, నాలుగు లీమూర్, జపాన్‌కు చెందిన క్యూఆర్‌ఎస్–సార్, ఇటలీకి చెందిన తైవోక్–0992, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫాట్–3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.