అందువల్ల ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని, కావేరి జలాల వివాదం పరిష్కారానికి, ప్రభుత్వ కార్యక్రమాల సక్రమ నిర్వహణకు అనువుగా అన్నాడీఎంకే పార్టీలో సీనియర్ నేతను ఉప ముఖ్యమంత్రిగానో లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానో నియమించాల్సిన అవసరం ఉందన్నారు.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా కోలుకోవాలని డీఎంకే పార్టీ, తమ అధ్యక్షుడు కరుణానిధి కోరుకుంటున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితులను రాజకీయం చేయదలచుకోలేదని మీడియా ప్రశ్నకు స్టాలిన్ బదులిచ్చారు.