కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని, రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడంతో.. ఆ నవ్వు రామాయణంలో ఎవరిదబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. తాజాగా రేణుకా చౌదరి వార్తల్లోకెక్కారు.
ఈసారి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు అమ్మారు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు అమ్మి రూ.5లక్షలు సేకరించారు. చేసిన అప్పులు తీర్చలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాల కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రేణుకా చౌదరి మొక్కజొన్నలను అమ్మారు.