కానీ షడెన్ గా గత మూడు రోజులుగా సినీకార్మికుల నాయకుల స్వలాభపేక్షతో నిన్న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ షూటింగ్ జరిగే ప్రాంతంలో కొందరు కార్మికులు మాకు న్యాయం కావాలని నినాదాలు చేశారు. ఇక నేడు ఫిలింఛాంబర్ పెద్దలు, కార్మిక నాయకులు, లేబర్ ఆఫీసర్ ల మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ సారాంశం ప్రకారం కొద్దిసేపటి క్రితమే ఛాంబర్ నుంచి నిర్మాతల అబిప్రాయం బయటకు వచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె కి మద్దతుగా విధులకు హాజరు కానీ వారిని మినహాయించి, ఎవరైతే, జరుగుతున్న షూటింగ్ లు ఆపుతూ అంతరాయం కలిగిస్తున్నారో, అలాగే ఆ షూటింగ్ లకు హాజరు అవుతున్న సభ్యులను బెదిరిస్తూ, షూటింగ్ లకు రాకుండా అడ్డుకుంటున్నారో వారిని మాత్రం భవిష్యత్తులో జరిగే షూటింగ్ లకు ఆ సభ్యులను తీసుకోకూడదని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.