అతడో వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కానీ, కామంతో కళ్లుమూసుకుని పోయాయి. వాయివరుసలు మరిచిపోయాడు. ఫలితంగా కుమార్తెపైనే కన్నేశాడు. ఆమెను లైంగికంగా అనుభవించి తన కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. కానీ, దుర్గమాతగా మారిన కన్నబిడ్డే కామాంధుడైన తండ్రిని కాటికి పంపింది.
ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... బరేలీకి చెందిన సోమ్‌పాల్(45) అనే వ్యక్తి స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. అతనికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో సోమ్‌పాల్ కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు.