#RKNagarElectionResult : 6వ రౌండ్ పూర్తి... 14083 ఓట్ల ఆధిక్యంలో టీటీవీ

ఆదివారం, 24 డిశెంబరు 2017 (12:54 IST)
చెన్నై, ఆర్కేనగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపులోనూ దినకరన్ తన ఆధిక్యతను నిలుపుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆరో రౌండ్ పూర్తయ్యేవరకు దినకరన్ 14083 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఫలితంగా ఆయన గెలుపు తథ్యమనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరో రౌండ్‌లో వివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను పరిశీలిస్తే
 
ఆరో రౌండ్ : దినకరన్ - 29267, మధుసూదనన్ - 15184, మరుదగణేష్ - 7983, నామ్ తమిళర్ కట్టి 1245, నోటా - 640, బీజేపీ - 408.
 
ఐదో రౌండ్ : దినకరన్ - 24132, మధుసూదనన్ 13057, మరుదు గణేష్ 6606, నామ్ తమిళర్ పార్టీ 962, బీజేపీ 318. 
 
నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి దినకరన్‌ - 20,298, మధుసూదనన్ -9,672, మరుదుగణేష్‌కు - 5,091, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్‌కు 117, నామ్ తమిళర్ కట్చి - 737 చొప్పున ఓట్లు పోలయ్యాయి.
 
మూడో రౌండ్ : దినకరన్‌ - 15868, మధుసూదనన్ - 7,033, మరుదుగణేష్‌కు - 3,750, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్‌కు 117, నామ్ తమిళర్ కట్చి - 737 చొప్పున ఓట్లు పోలయ్యాయి. కాగా, మొదటి, తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి ఓట్లు 66 ఓట్లు పోల్ కాగా, నోటాకు 102 ఓట్లు వచ్చాయి. 
 
అంతకుముందు టీటీవీ దినకర్ వర్గం కార్యకర్తలతో మొదలైన అన్నాడీఎంకే ఏజంట్లు, కార్యకర్తల మాటల యుద్ధం చినికి చినికి గాలివానగా మారగా, కౌంటింగ్ అధికారులపై వారు దాడికి దిగారు. దీంతో కౌంటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని రెండు వర్గాలనూ చెదరగొట్టి, మళ్లీ ఓట్ల లెక్కింపును కొనసాగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు