రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆ మోడ‌ల్ బైక్స్ వెన‌క్కి.... బ్రేక్స్ ప్రాబ్లెం!

సోమవారం, 20 డిశెంబరు 2021 (15:17 IST)
రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బండ్లు అంటే కుర్ర కారుకు ఈ మ‌ధ్య య‌మ క్రేజ్. అందుకే అంతా ఈ మ‌ధ్య ఈ బండి వేసుకుని డుగు డుగు మ‌ని తిరుగుతున్నారు. కానీ, వాటికి వెనుక బ్రేకు స‌మ‌స్య ఉంద‌నే కారణంగా,  రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ‘క్లాసిక్ 350’ మోడల్ ని రీకాల్ చేసింది.
 
 
వెనుక బ్రేక్‌లో సమస్య కారణంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ‘క్లాసిక్ 350’ మోడల్‌కు చెందిన 26,300 బండ్ల‌ను వెన‌క్కి కంపెనీకి తీసుకు రావాల‌ని తెలిపింది. వెనుక బ్రేక్ పెడల్‌ను గట్టిగా నొక్కినప్పుడు రెస్పాన్స్‌ బ్రాకెట్‌ దెబ్బతినే అవకాశం ఉండటం, పైగా శబ్దం వెలువడటం, బ్రేకింగ్ సామర్థ్యం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున వాటిని రీకాల్‌ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లో అత్యధికంగా అమ్ముడయ్యేవి క్లాసిక్‌ 350 మోడల్‌ బైక్‌లే.

 
ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్-ఛానల్ ఏబీఎస్‌, రియర్‌ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 బైక్‌లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు సంస్థ వివరించింది. వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్(వీఐఎన్‌) ఆధారంగా సర్వీస్‌ బృందాలు, స్థానిక డీలర్లు సంబంధిత వినియోగదారులను సంప్రదిస్తారని చెప్పింది. ‘డెవలప్‌మెంట్‌, టెస్టింగ్, నాణ్యత, మన్నిక విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తొచ్చు. వీటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని సంస్థ తెలిపింది. అంటే, ఆ బండి వాడ‌కుండా వెన‌క్కి తీసుకురావాల‌ని కంపెనీ ప్ర‌క‌టించిన‌ట్టే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు