సుప్రీంకోర్టు తలుపు తట్టనున్న జయలలిత నెచ్చెలి శశికళ

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (20:45 IST)
తమిళనాడు సీఎం పళనిస్వామి సారధ్యంలోని అధికార అన్నాడీఎంకే పార్టీకి రెండాకుల గుర్తును కేటాయిస్తూ 2017 నవంబర్ 23వ తేదీన ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏప్రిల్‌-మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయి.
 
త్వరలో క్యూరేటివ్ పిటిషన్ వేస్తామని ఆమ తరపు న్యాయవాది రాజా సెంథూర్ పాండ్యన్ తెలిపారు. ఆగస్టులో శశికళ విడుదల అవుతారని భావించామని, కరోనా వల్లే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలేకపోయామన్నారు. ఈ విషయమై తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
 
అన్నాడీఎంకేకు రెండాకుల గుర్తును కేటాయించడాన్ని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాల్ చేసినా ఉపయోగం లేకపోయింది. ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను 2019 మార్చి, 2020 జూలైల్లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. 
 
అవినీతి కేసులో నాలుగేండ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన శశికళను తమ పార్టీలో చేర్చుకోబోమని సీఎం పళనిస్వామి తేల్చి చెప్పడంతో అధికార పార్టీ అన్నాడీఎంకే తలుపులు మూసుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు