చిన్నమ్మ ఈజ్ బ్యాక్, మా సత్తా చూపిస్తాం: టిటివి దినకరన్

బుధవారం, 27 జనవరి 2021 (21:29 IST)
చిన్నమ్మ శశికళ జైలు జీవితం నుంచి బయటపడడంతో ఆమె వర్గీయుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పెద్దఎత్తున సంబరాల్లో మునిగితేలుతున్నారు. పరప్పణ జైలు నుంచి అధికారులు రిలీవ్ ఆర్డర్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడంతో శశికళ విడుదలైంది.
 
శశికళ మేనల్లుడు టిటివి దినకరన్ దగ్గరుండి విడుదలకు సంబంధించి అన్ని పనులను పూర్తి చేశారు. అయితే శశికళ విడుదలైన తరువాత దినకరన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిన్నమ్మ ఈజ్ బ్యాక్ అంటూ చెప్పుకొచ్చారు దినకరన్.
 
పళణి స్వామి, పన్నీరుసెల్వంలు సంబరాలు చేసుకుంటున్నారు. మేం చూస్తున్నాం.. మేము సంబరాలు చేసుకుంటున్నాం.. మేము మా సత్తాం చాటుతామని చెప్పుకొచ్చారు. పరోక్షంగా ముఖ్యమంత్రి పళణిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలకు వార్నింగ్ ఇచ్చారు దినకరన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు