అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ... ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం

మంగళవారం, 6 డిశెంబరు 2016 (01:14 IST)
అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియ నెచ్చెలి శశికళ ఎన్నికయ్యారు. శశికళను పార్టీ అధినేత్రిగా అన్నాడీఎంకే కార్యవర్గం ఎన్నుకుంది. అలాగే ముఖ్యమంత్రి జయలలిత వారసుడిగా ఆ రాష్ట్ర మంత్రి, జయలలిత నమ్మినభంటు ఓ పన్నీర్ సెల్వం ఎన్నికయ్యారు. దీంతో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
మరోవైపు చెన్నైలో ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతోంది. అమ్మ మరణంపై మరి కాసేపటికి అధికారిక ప్రకటన వెలువడక ముందే.. ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన ఎయిమ్స్ వైద్యులు తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్ననాటి నుంచి ఆమె సన్నిహితురాలు శశికళ, సీఎం సలహాదారు షీలా బాలకృష్ణన్ ఆస్పత్రిలోనే ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి