జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ళ జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల అపరాధం విధించిన విషయం తెల్సిందే. దీంతో ఆమెను బెంగుళూరు జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పరప్పణ అగ్రహార జైలులో శశికళకు ప్రాణహాని ఉందని తమిళనాడు నిఘా విభాగం పేర్కొన్న నేపథ్యంలో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు.
మరోవైపు ఆమెకు బెంగళూరు జైలులో ముప్పుందని న్యాయవాదులు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. సైనేడ్ మల్లికను వేరే జైలుకు తరలించినందున శశికళను చెన్నై జైలుకు మార్చేందుకు కోర్టు సుముఖత తెలుపకపోవచ్చని, అలాగే, జైలు అధికారులు శశికళను మరో జైలుకు మార్చేందుకు సుముఖంగా లేని కారణంగానే సైనేడ్ మల్లికను మరో జైలుకు మార్చినట్టు తెలుస్తోంది.