కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

బుధవారం, 2 జూన్ 2021 (21:34 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,31,456 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. వైరస్‌ బారినపడి మరో 3,207 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.  
 
కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టడంతో పాటు కోవిడ్‌-19 వ్యాక్సిన్ల కొనుగోళ్లపై బుధవారం కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ కొనుగోళ్ల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి పేర్కొంది.
 
టీకాలు వేసిన జనాభా శాతం (సింగిల్‌, డబుల్‌ డోసులు) డేటాను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు టీకాలు వేసుకున్న జనాభా శాతాన్ని తెలపాలని కేంద్రానికి స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ కొనుగోళ్ల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి సూచించింది.
 
అలాగే టీకాల కోసం  2021-22 కోసం కేంద్ర బడ్జెట్‌‌లో రూ.35,000 కోట్లు కేటాయించిన అంశంపై సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ నిధులను ఇంతవరకు ఎలా ఖర్చు చేశారని.. ఈ నిధులను ఉచితంగా టీకాలు వేయడానికి ఎందుకు వేయలేదని ప్రశ్నించింది.

వెబ్దునియా పై చదవండి