కొత్త నోటును స్కాన్ చేస్తే మోడీ ప్రసంగం కనిపిస్తుందా?: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..!

ఆదివారం, 20 నవంబరు 2016 (15:16 IST)
పెద్ద నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో చెత్త ప్రచారం జరుగుతోందని అంటున్నారు నిపుణులు. వాట్సాప్, ఫేస్ బుక్‌లో జనాన్ని భయపెట్టేలా తప్పుడు సందేహాలు సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిని బట్టి సోషల్ మీడియా జరిగే ప్రచారాన్ని గుడ్డిగా నమ్మకూడదని నిపుణులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సరదాగా జోకులు వేసుకుని నవ్వుకోవడం వరకే చేయమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 
కానీ జనాన్ని భయపెట్టేలా కొందరు పనిలేవివాళ్లు ప్రచారాలు మొదలుపెట్టారు. వీటిపై కేంద్రం నుంచిగానీ, ఆర్బీఐ నుంచిగానీ ఎలాంటి ప్రకటనలు లేవు. నిజానికి అలాంటివి జరిగే అవకాశం కూడా లేదని, ఇలా సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న చెత్త ప్రచారాల్లో ఒకటని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 
 
పాత నోట్లు ఇక చెత్తకాగితాలేనని, రూ.100, రూ.50 నోట్లు కూడా రద్దవుతాయని వచ్చే వార్తల్లో నిజం లేదని చెప్పారు. దేశంలో ఉప్పు కొరత వచ్చిందని, కొత్త నోటును స్కాన్ చేస్తే మోడీ ప్రసంగం కనిపించేలా సెక్యూరిటీ ఉందని వస్తున్న వార్తలన్నీ నిజం లేదని తెలిపారు. 
 
కొత్త నోటును స్కాన్ చేస్తే మోడీ ప్రసంగం కనిపించేలా సెక్యూరిటీ ఇదొక అర్థం లేని ప్రచారం జరుగుతుందని.. అలాంటి ఫీచర్ అస్సల్లేదు. ఇది ఒక ప్రైవేటు యాప్‌లో చేసిన ప్రయోగం మాత్రమే. 2వేల నోటు సెక్యూరిటీకి దీనికి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి