అమెరికాలో చదువు.. కరోనా అని ఇండియాకు వస్తే.. అలా వేధించి చంపేశారు..?

మంగళవారం, 11 ఆగస్టు 2020 (09:51 IST)
Sudiksha Bhati
అమెరికాలో చదువుకుంది. ఇంటర్ పరీక్షల్లో సుధీక్షా భాటీ.. జిల్లా టాపర్‌గా నిలిచింది. కానీ కొందరు ఆవారాగాళ్ల వల్ల ఆమె ఏకంగా ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయింది. వివరాల్లోకి వెళితే.. చక్కగా అమెరికాలో చదువుకునేది. కరోనా పుణ్యమా అని ఇండియా వచ్చింది. చివరకు విషాద పరిస్థితుల మధ్య ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకుంది. 
 
కరోనా కారణంగా అమెరికా నుంచి భారత్ వచ్చిన ఆ అమ్మాయి.. తన బంధువుల్ని కలిసింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తన అంకుల్ బైక్ వెనక ఎక్కి కూర్చుంది. రోడ్డుబై బైక్ వెళ్తోంది. ఇంతలో ఆవారాగాళ్లు బుల్లెట్‌పై వచ్చారు. సుధీక్షను ఏడిపిస్తూ... బుల్లెట్‌తో భయపెట్టసాగారు.
 
కాసేపు ఓవర్ టేక్ చేయడం, ఆ తర్వాత మళ్లీ వెనక్కి రావడం, మళ్లీ ఓవర్ టేక్, మళ్లీ వెనక్కి ఇలా నానా రకాలుగా బైక్ నడిపారు. అలా నడుపుతూనే... ఆమెను వేధించారు. ఆమె చాలా టెన్షన్ పడింది. ఓ దశలో సుధీక్ష కూర్చున్న బైక్ పక్కకు ఒరిగిపోయింది. అంతే ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇలా ఆవారాగాళ్ల వేధింపులతో జిల్లా టాపర్ ప్రాణాలు కోల్పోయింది. 
 
ఇకపోతే.. ఇప్పటికే సుధీక్ష టాలెంట్‌ని భారత్ గుర్తించింది. రూ.3.80 కోట్లను హెచ్‌సీఎల్ స్కాలర్‌షిప్‌గా ఇచ్చింది. ఫలితంగా ఆమె అమెరికాలోని బాబ్సన్ కాలేజీలో... భారత ప్రభుత్వ డబ్బులతో చదవసాగింది. కానీ కరోనా వల్ల ఇండియా రావడం వల్ల ఆమె ప్రాణాలే పోయాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇష్టమొచ్చినట్లు బైక్ నడిపి, ఆమెపై వేధింపులకు పాల్పడిన బైకర్లపై కేసు నమోదైంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు