శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తూ.. బుద్ధుడూ, మహాత్మా గాంధీలు అనుసరించిన మార్గం, చేసిన బోధనలు అందరికీ ఆచరణీమని అన్నారు. అయితే ఇదే ప్రసంగంలో బుద్ధుడు భారతీయుడని జై శంకర్ అన్నట్టు నేపాల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ జై శంకర్ వ్యాఖ్యలను తప్పుబట్టింది.
బుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించారనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయని, వాటిని ఎవరూ కాదనలేరని పేర్కొంది. లుంబినీ ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గానూ ఇప్పటికే గుర్తింపు పొందిందని గుర్తు చేసింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ లో పర్యటించిప్పుడు పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది.