పాఠశాల విద్యార్థులు తరగతిగదిలోనే వీధి రౌడీల్లా మారి ఓ విద్యార్థిని చితకబాదిన ఘటన వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని టార్గెట్ చేసి కొందరు విద్యార్థులు చితకబాదుతున్న ఈ వీడియోను కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అనంతరం సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ వీడియో చేరేంతవరకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయాలంటూ ఫేస్‌బుక్, వాట్సప్‌లలో షేర్ చేస్తున్నారు.