కేరళలో 31 వరకు స్కూల్స్, సినిమా థియేటర్స్ బంద్

బుధవారం, 11 మార్చి 2020 (06:15 IST)
తమ రాష్ట్రంలో మరో ఆరుగురికి కరోనా వైరస్‌ సోకిందని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో కేరళలో కరోనా సోకిన వారి సంఖ్య 12కు పెరిగిందని చెప్పారు. ఈ నెల 31వ తేదీ వరకు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తరగతులు, పరీక్షలను నిర్వహించకూడదని ఆదేశించారు.

8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని చెప్పారు. అన్ని ట్యూషన్‌ క్లాసులు, అంగన్వాడీలు, మదర్సాలను, సినిమా థియేటర్స్ లను ఈ నెల 31వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు.
 
అదే విధంగా.. రేపటి నుండి మార్చి 31 వరకు రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూసివేయబడతాయని మళయాళం సినిమా ఆర్గనైజేషన్ తెలిపింది. కరోనా ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
 
మహారాష్ట్రలో తొలి కేసులు
మంగళవారానికి దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 46 కి చేరింది. పూణేకు చెందిన ఒక జంట వైరస్ టెస్ట్ లు చేయగా వారిద్దరికి ..పాజిటివ్ కేసు నమోదైంది. మహారాష్ట్రలో నమోదైన మొదటి కేసులివి. వీరిద్దరూ అంతకుముందు దుబాయ్ లో ఉండి ఇండియాకు వచ్చినట్టు తెలిసింది. వారు ఇప్పుడు ఐసోలేషన్ వార్డులో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు