హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో కొన్ని అల్లరి మూకలు ఏకంగా పోలీసు స్టేషన్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన సమయంలో ఇన్‌స్పెక్టర్‌తో సహా పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. వారందరూ ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రాళ్ల దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలపై సైతం రాళ్లతో దాడి చేశారు.
ఈ దాడి కారణంగా పరిస్థితి చేయదాటిపోతుందని భావించిన పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అలాగే, హుబ్లీ నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అటు ఢిల్లీలో కూడా హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా కొందరు రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెల్సిందే.