స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. స్వీయచిత్రాల (సెల్ఫీ)ల పిచ్చి బాగా ముదిరిపోయింది. అంటే ఇదో మానసిక జాఢ్యంగా మారిపోతోంది. ఫలితంగా అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు.
ఉదాహరణకు.. హైమ అనే యువతి ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్. ఇటీవలే ఆమె ముక్కుకు సర్జరీ చేయించుకోడానికి ఎయిమ్స్ ఈఎన్‌టీ విభాగానికి వెళ్లింది. వైద్యుడు ఆమెను పరీక్షించి.. ఆమె ముక్కులో ఏ లోపం లేదని తేల్చారు. అందంగా కనపడాలన్న తాపత్రయంతో పదేపదే సెల్ఫీలు తీసుకుంటూ, వాటిని ఇతరుల మెప్పుకోసం సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని వైద్యుడు గమనించాడు.